Homeజిల్లా వార్తలుకామారెడ్డి జిల్లాలో తీవ్ర విషాదం.. పిల్లలతో కలిసి బావిలో దూకి తండ్రి ఆత్మహత్య?

కామారెడ్డి జిల్లాలో తీవ్ర విషాదం.. పిల్లలతో కలిసి బావిలో దూకి తండ్రి ఆత్మహత్య?

ఇదే నిజం కామారెడ్డి : కామారెడ్డి జిల్లా లో దసరా పండగ వేళ తీవ్ర విషాధం చోటు చేసుకుంది క్షణికావేశం ఇద్దరు పిల్లలప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. దసరా పండగ వేళ కొత్త బట్టలు వేసుకుని సరదాగా గడపాలని ఆశించిన చిన్నారులు కాలగర్భంలో కలిసిపోయారు. ఓ తండ్రి తాను చనిపోతూ ఇద్దరు పిల్లల్ని బావిలో తోసేసిన ఘటన తాడ్వాయి మండలం నందివాడ గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన చిట్టపు శ్రీనివాస్ పండగ రోజు పిల్లలతో కలిసి పాలపిట్టను చూడటానికి వెళ్ళాడు. తండ్రితో చిన్నారులు విగ్నేష్ (07), అనిరుద్ (05) కొత్త బట్టలు, షూస్ వేసుకుని సంతోషంగా వెళ్లారు. అయితే ఇద్దరు చిన్నారుల మృతదేహాలు గ్రామ శివారులోని ఓ బావిలో పైకి తేలాయి. దీంతో గ్రామస్తులు షాక్ కు గురయ్యారు. తండ్రికి సంబంధించిన ఫోన్, చెప్పులు బావి గట్టున ఉండటంతో అతను కూడా చనిపోయి ఉంటాడని గ్రామస్తులు బావిలో గాలింపు చేపడుతున్నారు. పండగ పూట చిన్నారుల మృతి గ్రామంలో విషాదం నెలకొంది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Recent

- Advertisment -spot_img