Homeహైదరాబాద్latest NewsDeepika padukone : ''ఎల్ అండ్ టీ'' సంస్థ చైర్మన్‌పై హీరోయిన్ దీపికా పదుకొణె సీరియస్.....

Deepika padukone : ”ఎల్ అండ్ టీ” సంస్థ చైర్మన్‌పై హీరోయిన్ దీపికా పదుకొణె సీరియస్.. ఎందుకంటే..?

Deepika padukone : బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొణె మానసిక ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇస్తోంది. ఏం చేసినా మానసిక ఆరోగ్యం బాగుండాలని చెబుతూ వస్తున్నారు. ఇటీవలే ”ఎల్ అండ్ టీ” సంస్థ అధినేత ఎస్.ఎన్.సుబ్రమణియన్ ఉద్యోగులు వారానికి 90 గంటలు పని చేయాలి అని చేసిన ప్రకటన చేసాడు. ఆఫీస్ లో వారానికి 90 గంటలు పనిచేయాలని ఆయన చేసిన వ్యాఖ్య వైరల్‌గా మారింది. ఆదివారం కూడా ఉద్యోగులు పనిచేయాలని కోరారు. అయితే ఎల్ అండ్ టీ చైర్మన్‌పై నెటిజన్లు మండిపడుతున్నారు. తాజాగా ఈ విషయంపై దీపిక పదుకొణె (Deepika padukone) స్పందించింది. ఇలాంటి ఉన్నత స్థాయి వ్యక్తులు ఇలాంటి ప్రకటనలు చేయడం దిగ్భ్రాంతి కలిగిస్తోందని దీపికా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. ఈ పోస్ట్‌కి #mentalhealthmatters అనే హ్యాష్‌ట్యాగ్ జోడించబడింది. మానసిక ఆరోగ్యం చాలా ముఖ్యమనే అభిప్రాయాన్ని దీపిక వ్యక్తం చేసింది.ఉద్యోగుల సంక్షేమం గురించి ఆలోచించే వ్యక్తిత్వం ఆయనకు లేదని పేర్కొన్నారు.as 125 ఇదేనిజం Deepika padukone : ''ఎల్ అండ్ టీ'' సంస్థ చైర్మన్‌పై హీరోయిన్ దీపికా పదుకొణె సీరియస్.. ఎందుకంటే..?

Recent

- Advertisment -spot_img