HomeసినిమాDeepika Padukone : మా నాన్న జీవితాన్ని సినిమా తీస్తా..

Deepika Padukone : మా నాన్న జీవితాన్ని సినిమా తీస్తా..

Deepika Padukone : మా నాన్న జీవితాన్ని సినిమా తీస్తా..

Deepika Padukone : బాలీవుడ్‌లో మ‌రో బ‌యోపిక్ రాబోతోంది.

ప్ర‌ముఖ బ్యాడ్మింట‌న్ ప్లేయ‌ర్‌, బాలీవుడ్ న‌టి దీపికా ప‌దుకోన్ తండ్రి ప్ర‌కాశ్ ప‌దుకోన్ జీవితం ఆధారంగా ఓ సినిమా తెర‌కెక్క‌బోతోంది.

ఈ బ‌యోపిక్‌ను నిర్మించ‌బోయేది మ‌రెవ‌రో కాదు.. దీపిక‌నే.

త‌న తండ్రి జీవిత చ‌రిత్ర‌ను సినిమాగా తెర‌కెక్కించేందుకు స‌న్నాహాలు చేస్తోంది.

ఇదే విష‌యాన్ని దీపికా ప‌దుకోన్‌ తాజాగా వెల్ల‌డించింది.

అంతర్జాతీయంగా బ్యాడ్మింటన్ ఆటలో మన దేశ ఉనికిని చాటిన క్రీడాకారుడు ప్ర‌కాశ్‌ ప‌దుకోన్‌.

దీపిక న‌టిగా పాపుల‌ర్ అయ్యేంత‌వ‌ర‌కు కూడా ప్ర‌కాశ్ ప‌దుకోన్ కూతురిగానే గుర్తింపు ఉండేది.

అయితే తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో మాట్లాడిన దీపికా ప‌దుకోన్‌.. త‌న తండ్రి బ‌యోపిక్ నిర్మించ‌బోతున్న‌ట్లు ప్ర‌క‌టించింది.

ఏ సౌకర్యాలు లేని రోజుల్లో నాన్న ప్రకాశ్‌ బ్యాడ్మింటన్‌లో అద్భుత విజయాలు సాధించారు.

BSNL Prepaid Plans : హైస్పీడ్ డేటాతో బీఎస్ఎన్ఎల్ కొత్త ప్లాన్స్‌

Credit Card Money Draw : క్రెడిట్ కార్డు నుంచి చార్జీలు ప‌డ‌కుండా డ‌బ్బు డ్రా చేయ‌డం ఎలా..?

ఆయన ఓ పెండ్లి మండపంలో సాధన చేసేవారు.

భారత క్రికెట్ జట్టు 1983లో ప్రపంచకప్ గెలవక ముందే దేశంలో పేరున్న క్రీడాకారుడిగా నాన్నకు గుర్తింపు ఉండేది.

ఇప్పుటిలా అన్ని సదుపాయాలు అప్పుడు ఉంటే నాన్న ఇంకెన్ని విజయాలు సాధించేవారో అని ఆ ఇంట‌ర్వ్యూలో చెప్పింది.

ప్ర‌కాశ్ ప‌దుకోన్ బ‌యోపిక్ నిర్మాణ బాధ్య‌త‌లు తానే చూసుకుంటాన‌ని స్ప‌ష్టం చేసింది.

ఈ సినిమాకు సంబంధించిన న‌టీనటులు, సాంకేతిక నిపుణుల వివ‌రాల‌ను త్వ‌ర‌లోనే వెల్ల‌డిస్తాన‌ని చెప్పింది.

ఇటీవ‌ల ఆమె న‌టించి గెహ్ర‌యాన్ వెబ్‌సిరీస్‌కు మంచి స్పంద‌న వ‌స్తోంది.

ఈ స్పంద‌న‌కు ప్రేక్ష‌కుల‌కు కృత‌జ్ఞ‌త‌లు చెప్పింది దీపిక‌.

ప్ర‌స్తుతం ఈమె ప్ర‌భాస్‌తో క‌లిసి ప్రాజెక్ట్ కె సినిమాలో న‌టిస్తోంది.

ఇవికాకుండా ప‌టాన్‌, ఫైట‌ర్‌, హాలీవుడ్ ఫిలిం ది ఇంట‌ర్న్ రీమేక్స్ ఆమె చేతిలో ఉన్నాయి.

Electric Plug : ప్ల‌గ్గులో మూడో పిన్ ఎందుకు, ఉప‌యోగాలు ఏంటి..

Visa : శక్తిమంతమైన పాస్ పోర్ట్ జాబితాలో భారత్.. వీసా లేకుండా 60 దేశాలకు

Insurance : 2 కోట్ల కుటుంబాలకు ఉచితంగా రూ.5 లక్షల బీమా

Recent

- Advertisment -spot_img