ఆల్ టైమ్ గ్రేటెస్ట్ బ్యాటర్‌లలో ఒకరైన డేవిడ్ వార్నర్. అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్. టీ20 వరల్డ్ కప్ 2024లో భాగంగా భారత్ తో ఆసీస్ మ్యాచ్ ఓడిపోవడంతో వార్నర్ అంతర్జాతీయ కెరీర్ ముగిసింది.టీ20 ప్రపంచకప్ 2024 తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటిస్తానని ఈ లెఫ్ట్ హ్యాండర్ ఈ ఏడాది ప్రారంభంలో చెప్పిన సంగతి తెలిసిందే. వరల్డ్ కప్ లో భాగంగా ఆస్ట్రేలియా సోమవారం (జూన్ 24) టీమిండియాతో మ్యాచ్ ఓడిపోయింది. దీంతో సెమీస్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. మంగళవారం (జూన్ 25) బంగ్లాదేశ్ పై ఆఫ్ఘనిస్తాన్ విజయం సాధించడంతో ఆసీస్ సూపర్ 8-లోనే ఇంటిదారి పట్టింది. దీంతో ఆసీస్ ఈ టోర్నీలో ఆడే అవకాశం లేకుండా పోయింది. తన చివరి మ్యాచ్ లో వార్నర్ 6 పరుగులే చేసి అర్షదీప్ సింగ్ బౌలింగ్ లో ఔటయ్యాడు. వరల్డ్ కప్ టైటిల్ తో ఆస్ట్రేలియాకు వీడ్కోలు చెబుదామనుకున్న వార్నర్ కు నిరాశ తప్పలేదు. మ్యాచ్ తర్వాత ఈ ఆసీస్ ఓపెనర్ కు ష్టాండింగ్ ఒవేషన్ కూడా లేదు. బాధతోనే తన అంతర్జాతీయ క్రికెట్ ను ముగించాల్సి వచ్చింది.
చివరి మ్యాచ్‌లో ఓటమి.. కట్‌చేస్తే.. రిటైర్మెంట్ ప్రకటించిన డేవిడ్ వార్నర్