హైదరాబాద్: డిగ్రీ అడ్మిషన్తు ప్రారంభమయ్యాయి. ఈ నెల 26 లోపు సెల్ఫ్ రిపోర్టు చేయాల్సి ఉంటుంది. డిగ్రీ అడ్మిషన్ల ప్రక్రియ అక్టోబరు-15న ముగియనుంది. నవంబరు-1 నుంచి డిగ్రీ, పీజీ తరగతులు ప్రారంభించాలని యూజీసీ ఆదేశించిన నేపథ్యంలో.. ఇండక్షన్ క్లాసులు, రెగ్యులర్ తరగతుల ప్రారంభ తేదీని దోస్త్ రెండోవిడత ప్రక్రియ పూర్తయిన వెంటనే ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. నవంబర్ మొదటి వారంలో ‘ఇండక్షన్ క్లాసెస్’ నిర్వహించే అవకాశం ఉంది.
ఇందులో ఏమీ చెప్తారంటే..
డిగ్రీ విద్యార్థులకు కరోనా క్లాసులు చెప్పనున్నారు. ఇందులో కరోనా రాకుండా పాటించాల్సిన జాగ్రత్తలతోపాటు దాని వ్యాప్తి నిరోధానికి తీసుకోవాల్సిన చర్యల గురించి వివరించనున్నారు. దీంతోపాటు వ్యక్తిత్వ వికాసానికి ఉపయోగపడే లెసన్స్ ని కూడా చెప్పనున్నారు. ఎంచుకున్న కోర్సుకు సంబంధించి కెరీర్ అవకాశాలపై సంబంధిత లెక్చరర్ల ద్వారా అవగాహన కల్పిస్తారు.