Delhi Assembly Elections: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగింది. ఎన్నికల షెడ్యూల్ ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. జనవరి 10న నోటిఫికేషన్, 17న నామినేషన్లకు ఆఖరు తేదీగా నిర్ణయించారు. 18న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. 20వ తేదీలోగా నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం కల్పించారు. ఫిబ్రవరి 5న పోలింగ్ జరుగుతుంది. 8న ఓట్ల లెక్కింపు ఉంటుంది. 70 అసెంబ్లీ స్థానాలున్న దిల్లీ అసెంబ్లీకి ఈ ఏడాది ఫిబ్రవరి 23తో గడువు పూర్తవనుంది.