ఢిల్లీని భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడి రాజేంద్రనగర్‌లోని రావ్ ఐఏఎస్ కోచింగ్ సెంటర్‌లోకి వరద నీరు పోటెత్తి ముగ్గురు విద్యార్థులు మృతి చెందిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. అయితే శనివారం కురిసిన వర్షానికి ఢిల్లీలోని రాజేంద్రనగర్‌లోని రూస్ ఐఏఎస్ స్టడీ సర్కిల్ భవనంలోని బేస్‌మెంట్ మొత్తం నీటితో నిండిపోయింది. అందులో విద్యార్థులు చిక్కుకున్నట్లు రాత్రి 7.20 గంటలకు సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ వారు అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఐదు ఫైర్ ఇంజన్లతో నీటిని బయటకు పంపారు. అయితే అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.