Homeహైదరాబాద్latest NewsDelhi : దేశ రాజధానిలో Air Pollution Effect

Delhi : దేశ రాజధానిలో Air Pollution Effect

– స్కూళ్లకు మరో 5 రోజులు సెలవులను పొడిగించిన ఢిల్లీ విద్యాశాఖ

ఇదే నిజం, నేషనల్ బ్యూరో: దేశ రాజధాని ఢిల్లీలో ఎయిర్ పొల్యూషన్ తీవ్రంగా పెరగడంతో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రైమరీ స్కూళ్లకు సెలవులను మరో ఐదు రోజులు పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. గతంలో నవంబరు 5 వరకు ఇచ్చిన సెలవులను.. తాజాగా నవంబరు 10వ తేదీ వరకు పొడిగించింది. 6 నుంచి పదో తరగతి స్టూడెంట్లకు స్కూల్​లో లేదా ఆన్​లైన్​లో క్లాసులు చెప్పుకోవచ్చని తెలిపింది. ‘ఢిల్లీలో ఎయిర్ పొల్యూషన్ తీవ్రత పెరుగుతుండటంతో ప్రైమరీ స్కూళ్లకు నవంబరు 10 వరకు సెలవులు పొడిగిస్తున్నాం. ఆరు నుంచి ఆపై తరగతుల వారికి యథావిధిగా క్లాసులు నిర్వహించుకోవచ్చు. ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహించే అవకాశం కూడా ఇస్తున్నాం’అని ఢిల్లీ విద్యాశాఖ మంత్రి అతిషీ తెలిపారు. ఆదివారం ఢిల్లీలో ఎయిర్​ క్వాలిటీ ఇండెక్స్(ఏక్యూఐ) 486గా ఉంది. శనివారం(504)తో పోలిస్తే స్వల్పంగా తగ్గింది. గత ఆరు రోజులుగా దేశ రాజధానిలో ఇదే పరిస్థితి కొనసాగుతోంది. మరోవైపు ఢిల్లీలో విషవాయువుల గాఢత (పీఎం) 2.5 స్థాయిలోనే ఉంది. ఇది ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్​వో) జారీ చేసిన ప్రమాణాల కంటే 80 రెట్లు అధికం. ఈ గాలిని పీల్చడంతో జనం తీవ్ర అస్వస్థతకు గురికావడంతో పాటు కంటి దురద, శ్వాసకోశ సంబంధిత రోగాల బారిన పడే అవకాశం ఉందని డాక్టర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చుట్టుపక్కల రాష్ట్రాల్లో పంట వ్యర్థాలను తగులబెట్టడం, అత్యంత ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఈ కాలుష్యానికి కారణమయ్యాయి.

RELATED ARTICLES

Recent

- Advertisment -spot_img