మద్యం కుంభకోణం కేసులో కవిత, కేజ్రీవాల్ జ్యుడీషియల్ కస్టడీని దిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు పొడిగించింది. కవిత కస్టడీని మరో 14 రోజులు పొడిగించగా..కేజ్రీవాల్ కస్టడీని మే 7 వరకు పొడిగించింది. ఇవాళ్టితో కవిత జ్యుడీషియల్ కస్టడీ ముగియనుండగా కోర్టు మరో 14 రోజులు పొడిగించింది. మరోవైపు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఈ కేసుకు సంబంధించి దర్యాప్తును వేగవంతం చేశాయి.