DELHI : ఢిల్లీ చీఫ్ లిక్కర్ స్కాంతో తనకు సంబంధం లేదని సీఎం కేసీఆర్ తనయ, ఎమ్మెల్సీ కవిత స్పష్టం చేశారు.
బీజీపీ నేతలు చేస్తున్న ఆరోపణలను ఆమె స్పందించారు. బీజేపీ నేతలు కావాలనే తనపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ను మానసికంగా క`ంగదీయాలనే దుర్భుద్దితో బీజేపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారని ఆరోపించారు. ఇటువంటి జిమ్మిక్కులకు కేసీఆర్ భయపడరని అన్నారు. భయపడేది లేదన్నారు.
తనపై ఆరోపణలు చేసిన ఢిల్లీ బీజేపీ ఎంపీ ముజిందర్ సిర్సాపై పరువునష్టం కేసు వేసుందుకు కవిత ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. దీనికోసం న్యాయనిఫుణులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిసింది.