ఢిల్లీ మద్యం విధానం కుంభకోణం కేసులో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జ్యుడీషియల్ కస్టడీని రౌజ్ అవెన్యూ కోర్టు పొడిగించింది. మే 14వ తేదీ వరకు పొడిగిస్తూ మంగళవారం న్యాయమూర్తి కావేరి బవేజా ఆదేశాలు జారీచేశారు. అంతేకాకుండా కుటుంబసభ్యులను కలిసేందుకు అనుమతినిచ్చింది. మరోవైపు, వారం రోజుల్లో కవితపై ఛార్జ్ షీట్ దాఖలు చేస్తామని న్యాయస్థానానికి ఈడీ తెలిపింది.