Homeహైదరాబాద్latest NewsDelivery Boy : Raped a woman for delivery of goods Delivery Boy...

Delivery Boy : Raped a woman for delivery of goods Delivery Boy : సరుకులు డెలివరీ చేసేందుకు వెళ్లి మహిళపై అత్యాచారం

– పోలీసుల ముందు లొంగిపోతున్నట్లు నటించి గన్ లాక్కుని పరారీ
– నిందితుడి కాళ్లపై కాల్పులు జరిపి అదుపులోకి తీసుకున్న పోలీసులు
– గ్రేటర్ నోయిడాలో ఘటన

ఇదే నిజం, నేషనల్ బ్యూరో: ఉత్తరప్రదేశ్​లోని గ్రేటర్‌ నోయిడాలో దారుణం జరిగింది. నిత్యావసరాలు డెలివరీ చేసేందుకు వెళ్లిన ఓ వ్యక్తి.. ఆ ఇంట్లో ఒంటరిగా ఉన్న మహిళపై అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు గాలింపు చేపట్టగా.. దొరికినట్టే దొరికి వాళ్ల నుంచి తుపాకీ లాక్కొని పారిపోయేందుకు ప్రయత్నించాడు. చివరికి అతడిపై కాల్పులు జరిపి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శుక్రవారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గ్రేటర్‌ నోయిడాలోని హైరైజ్‌ అపార్ట్‌మెంట్‌లో ఓ మహిళ ఉంటున్నారు. ఇంటికి అవసరమైన సరకులను ఆమె ఓ యాప్‌లో ఆర్డర్‌ చేశారు. వాటిని తీసుకొని సుమిత్‌ సింగ్(23) అనే డెలివరీ బాయ్‌ ఆమె ఇంటికి వెళ్లాడు. ఇంట్లో ఆమె ఒక్కరే ఉన్నారని నిర్ధారించుకొని, బలవంతంగా లోపలికి వెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత అక్కడి నుంచి పరారయ్యాడు. వెంటనే బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు బృందాలుగా ఏర్పడి నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

మొబైల్‌ సిగ్నల్స్‌ ఆధారంగా అతడు ఉన్న చోటును గుర్తించి, అక్కడికి వెళ్లే సరికి, వాళ్లకు లొంగిపోయినట్లు నటించాడు. అంతలోనే ఓ పోలీస్‌ కానిస్టేబుల్‌ నుంచి గన్‌ లాక్కొని పరారయ్యాడు. పోలీసులు అతడివెంట పరుగెడుతుంటే కాల్పులు జరిపాడు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో పోలీసులు అతడి కాళ్లపై ఎదురుకాల్పులు జరిపి అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం అతడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు నోయిడా పోలీసులు వెల్లడించారు. వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామని, ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయిన తర్వాత కోర్టు ఎదుట హాజరుపరుస్తామని తెలిపారు. అక్రమంగా మద్యం అమ్మకాలు జరుపుతున్నాడన్న కారణంతో గతంలోనూ సుమిత్‌పై కేసు నమోదైంది.

RELATED ARTICLES

Recent

- Advertisment -spot_img