Delivery boys : ప్రస్తుతం ఆన్‌లైన్ ఆర్డర్‌లకు ప్రజలు విపరీతంగా అలవాటుపడిపోయారు. డెలివరీ బాయ్స్ ఉదయం టిఫిన్ నుండి రాత్రి భోజనం వరకు, ఇళ్లకు మరియు కార్యాలయాలకు ఫుడ్ డెలివరీ చేస్తూ సమయంతో పోటీ పడుతున్నారు. అయితే పగులు రాత్రి అని తేడా లేకుండా డెలివరీ బాయ్స్ కష్టపడుతున్నారు. ప్రస్తుతం వేసవి కాలం వచ్చేసింది.. ఎండలు మాడిపోతున్నాయి. ఈ క్రమంలో మండే ఎండల్లోనే డెలివరీ బాయ్స్ ఫుడ్ ను తమ బైకులపై డెలివర్ చేస్తున్నారు. ఈ నేపధ్యంలో వారి కోసం చెన్నై కార్పొరేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. చెన్నైలో గిగ్ వర్కర్లు కోసం AC రెస్ట్ రూమ్స్ ఏర్పాటు చేసింది. వేసవిలో 45°C ఉష్ణోగ్రతలో పని చేసే డెలివరీ పార్ట్నర్స్ కోసం ప్రధాన రోడ్లపై AC రెస్ట్ రూమ్స్ ఏర్పాటు చేయనుండగా, స్విగ్గీ, జొమాటో, ఉబర్ డెలివరీ వర్కర్లు వీటిని ఉపయోగించుకోనున్నారు.