ఇదేనిజం, ధర్మపురి టౌన్: జగిత్యాల జిల్లా, ధర్మపురి మండలం, రాయపట్నం గ్రామంలో గత 20 రోజుల క్రితం నుండి ఒక మతిస్థిమితం లేని వ్యక్తి గ్రామ శివారులో తిరుగుతూ ఎవరైనా అన్నం ఇస్తే తింటూ ఉండేవాడు, గత పది రోజుల క్రితం రాయపట్నం గ్రామ శివారులోని HP పెట్రోల్ బంక్ సమీపంలో రోడ్డు పక్కన ఇతను పడి ఉండగా 108 ప్రభుత్వ ఆంబులెన్స్ లో ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ జగిత్యాల్లో చేర్పించారు. ఈ గుర్తు తెలియని వ్యక్తి మాట్లాడలేని స్థితిలో ఉండటం వలన అతని వివరాలు తెలియలేదు. జగిత్యాల ఏరియా హాస్పిటల్ లో చికిత్స పొందుతూ చనిపోయాడని సమాచారం తెలిసింది. ఈ వ్యక్తి ఎవరో, తన కుటుంబ సభ్యుల వివరాలు తెలిస్తే పోలీస్ వారికి సమాచారం ఇవ్వగలరని ధర్మపురి ఎస్సై మహేష్ తెలిపారు.