సికింద్రాబాద్ మోండా మార్కెట్ పోలీస్ పరిధిలోని ముత్యాలమ్మ దేవాలయంలో అమ్మవారి విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని పరారీలో ఉన్న నిందితులు కోసం గాలిస్తున్నారు. ఈ క్రమంలో అక్కడికి వచ్చిన కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ గో బ్యాక్ అంటూ నిరసన తెలిపారు.
విషయం తెలుసుకున్న భాజపా, హిందూ సంఘాల కార్యకర్తలు పెద్దఎత్తున ఆలయానికి చేరుకున్నారు. ఆలయంపై దాడి చేసిన వారిని శిక్షించాలని ధర్నాకు దిగారు. హిందూ దేశంలో హిందువులు పూజించే దేవుళ్ల విగ్రహాలకు మాత్రమే రక్షణ లేదని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి ఘటనలకు పాల్పడే వారిని ఎట్టిపరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోమని, ఈ ఘటనపై ప్రభుత్వం దృష్టి సారించి మరోసారి ఇలా జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు పెద్ద ఎత్తున ఘటనా స్థలాని మోహరించారు. దీంతో ఉద్రిక్తత నెలకొంది.