Homeజిల్లా వార్తలురామమ్మకుంట చెరువులో వెలిసిన ఆక్రమణల కూల్చివేత..

రామమ్మకుంట చెరువులో వెలిసిన ఆక్రమణల కూల్చివేత..

ఇదేనిజం, శేరిలింగంపల్లి: గచ్చిబౌలి రామమ్మకుంట చెరువులో వెలిసిన ఆక్రమణలను మంగళవారం కూల్చివేశారు. శేరిలింగంపల్లి మండలం గచ్చిబౌలి సర్వేనెంబర్ 71లో 3 ఎకరాల విస్తీర్ణంలో రామమ్మకుంట చెరువు విస్తరించి ఉంది. గచ్చిబౌలిలోని నేషనల్ ఇన్స్ స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ హాస్పిటల్ మేనేజ్మెంట్ (నిథిమ్) లో గతంలో చెరువును ఆక్రమించి నిర్మాణాలు చేపట్టారు. కాగా ఈ చెరువు చుట్టూ నిథిమ్ క్యాంపస్ విస్తరించి ఉండగా గత కొన్ని సంవత్సరాల క్రితం నిథిమ్ యాజమాన్యం చెరువు బఫర్ జోన్ లో కొత్త భవన నిర్మాణం ప్రారంభించింది. చెరువును పూడ్చి భవన నిర్మాణం చేపట్టడంపై పలు స్వచ్ఛంద సంస్థలు, హెచ్ఆర్సిసి కోర్టును ఆశ్రయించాయి. దీంతో వివాదం కోర్టుకు చేరగా భవన నిర్మాణం మధ్యలోనే నిలిచిపోయింది. కాగా కొన్ని రోజుల క్రితం హైకోర్టు సదరు భవనాన్ని తొలగించాలని ఆదేశాలు ఇవ్వడంతో నిథిమ్ యాజమాన్యం భవనం కూల్చివేత పనులు మంగళవారం చేపట్టింది.

Recent

- Advertisment -spot_img