తెలంగాణలో మూసీ నది పరివాహక ప్రాంతాల్లో ఇళ్ల కూల్చివేతలను మంగళవారం నుంచి పునఃప్రారంభించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. అయితే మూసీ రివర్ బెడ్ పై 2,116 గృహాలు నిర్మించినట్లు గుర్తించారు. కూల్చివేతల పున: ప్రారంభించనున్న క్రమంలో మూసీ పరివాహక ప్రాంతాల్లోని 100 మందికి పైగా ఇళ్ల యజమానులు తమ ఇళ్లకు ఫ్లెక్సీలు వేలాడదీశారు. తమ ఇళ్లను కూల్చివేయవద్దని హైకోర్టు స్టే ఆర్డర్ ఇచ్చిందని అందులో పేర్కొన్నారు.