Homeహైదరాబాద్latest NewsAlert: తెలంగాణలో డెంగీ డేంజర్ బెల్స్.. 3 వేలకు పైగా నమోదైన డెంగ్యూ కేసులు..!

Alert: తెలంగాణలో డెంగీ డేంజర్ బెల్స్.. 3 వేలకు పైగా నమోదైన డెంగ్యూ కేసులు..!

తెలంగాణలో వర్షాలతో పాటు డెంగ్యూ ఫీవర్ కూడా తీవ్ర ప్రభావం చూపిస్తోంది. ఆగస్టు నెలలో తొలి పద్దెనిమిది రోజుల్లోనే అధికారికంగా 1,624 మందికి డెంగ్యూ సోకినట్లుగా నిర్ధారణ అయింది. ఇందులో సగం ఒక్క హైదరాబాద్‌లోనే నమోదయ్యాయి. పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ కార్యాలయం నుండి వచ్చిన సమాచారం ప్రకారం, తెలంగాణలో జూలై 1 మరియు ఆగస్టు 18 మధ్య 3,000 పైగా డెంగ్యూ కేసులు నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా 32,091 డెంగ్యూ కేసులు నమోదు కాగా 32 మంది మరణించారు.

spot_img

Recent

- Advertisment -spot_img