డెంగీ ఫీవర్ ఎవరికైనా రెండోసారి సోకితే, మొదటిసారి కంటే తీవ్రంగా ఉండొచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. డెంగీ వైరస్‌లలో నాలుగు రకాలున్నాయి. ఒక రకం వైరస్‌లో ఒకసారే డెంగీ వస్తుంది. మొదటిసారి ఒక వేరియంట్ సోకి, రెండోసారి మరో వేరియంట్ వల్ల జ్వరం వస్తే మాత్రం ప్రమాదకరం. ఎందుకంటే, శరీరంలో ఒక వేరియంట్ కి వ్యతిరేకంగా వృద్ధి చెందిన రోగనిరోధక శక్తి, రెండోసారి సోకిన వేరియంట్ పై పనిచేయడం అనుమానమే అని వైద్యులు చెప్పారు.