Homeహైదరాబాద్latest Newsసింగరేణి కార్మికులకు బోనస్ చెక్కుల పంపిణీ చేసిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

సింగరేణి కార్మికులకు బోనస్ చెక్కుల పంపిణీ చేసిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

2023-24 సంవత్సరానికి గాను సింగరేణికి రూ.2412 కోట్ల లాభం వచ్చింది. ఈ లాభాలలో 33 శాతం రూ.796 కోట్లను కార్మికులకు బోనస్ గా ప్రకటించిన ప్రభుత్వం.ఒక్కో కార్మికుడికి లక్షా 90 వేల రూపాయల బోనస్ ను ప్రకటించింది. కార్మికులకు ప్రభుత్వం బోనస్ చెక్కులను పంపిణీ చేసింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్‌బాబు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి చేతుల మీదుగా కార్మికులు బోనస్‌ చెక్కులను అందుకున్నారు. దాదాపు 42 వేల మంది కార్మికులు ఒక్కొక్కరికి రూ. 1.90 లక్షలు బోనస్. ఈ ఏడాది కూడా సింగరేణిలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులకు రూ. 5 వేల బోనస్ ప్రకటించింది.

Recent

- Advertisment -spot_img