కొత్తగూడెంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పీచ్ పాయింట్స్
1. రెండు లక్షల రుణమాఫీ చేసి చూపిస్తాం.
2. ఆగస్టు కాదు అంతకన్నా ముందే చేసి చూపిస్తాం. రైతు రుణమాఫీని ఎవరు ఆపలేరు.
3. ప్రజాభిప్రాయం సేకరించి, విధి విధానాలు రూపొందించి, అసెంబ్లీలో చర్చించి రైతు భరోసా అమలు చేస్తాం.
4. గత పాలకులు రాష్ట్రాన్ని తాకట్టు పెట్టి 50 వేల కోట్లు అప్పు తెచ్చి మిషన్ భగీరథ చేపట్టారు.. రాష్ట్రంలో 5. ఆర్థిక విధ్వంసాన్ని సృష్టించారు.. అయినా ఇంటింటికి తాగు నీటిని ఇవ్వలేకపోయారు.
6. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నిటినీ నెరవేరుస్తాం.
7. రాష్ట్ర ప్రజల డబ్బుకు జవాబుదారీగా ఉంటాం.
8. గత పదేళ్లు పాలించిన వారు రాష్ట్ర సంపదను దోపిడీ చేసి, ఎవరికి పడితే వారికి పంచారు. 7 లక్షల కోట్ల అప్పు చేసి.. పారిపోయారు.
9. రామగుండం లో సూపర్ క్రిటికల్ టెక్నాలజీ తో థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మించేందుకు ప్రణాళికలు చేస్తున్నాం త్వరలో శుభవార్త వింటారు.
10. కొత్తగూడెం పాల్వంచ రెండు పట్టణాలు కలిపి కార్పొరేషన్ ఏర్పాటు చేసే ఆలోచనను పరిశీలిస్తాం.