యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కించిన మూవీ ‘దేవర’. తాజాగా ఈ సినిమాను హాలీవుడ్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే ‘బియాండ్ ఫెస్ట్’లో ప్రదర్శించబోతున్నారు. లాస్ ఏంజెల్స్‌లోని ఐకానిక్ ఈజిప్షియన్ థియేటర్‌లో ఈ నెల 26న సాయంత్రం 6:30 గంటలకు ఈ మూవీని ప్రదర్శించనున్నారు. దీనికోసం ఎన్టీఆర్ సెప్టెంబర్ 25న అమెరికా వెళ్లనున్నారని సినీ వర్గాలు తెలిపాయి.