Homeహైదరాబాద్latest News'దేవర' మాస్ జాతర షురు.. ఫ‌స్ట్ సింగిల్ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఫుల్ ఖుషిలో ఫ్యాన్స్..!

‘దేవర’ మాస్ జాతర షురు.. ఫ‌స్ట్ సింగిల్ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఫుల్ ఖుషిలో ఫ్యాన్స్..!

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా వ‌స్తున్న తాజా చిత్రం ‘దేవర’. ద‌ర్శ‌కుడు కొరటాల శివ ఈ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తుండ‌గా.. జాన్వీకపూర్ హీరోయిన్‌గా న‌టిస్తుంది. ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్, గ్లింప్స్ చూస్తుంటే ఈ సారి థియేటర్లలో తారక్ ఏ స్థాయిలో తుఫాన్ సృష్టించనున్నాడో అర్థమవుతుంది. మే 20న ఎన్టీఆర్ పుట్టినరోజు. దీంతో ఇప్పుడే సోషల్ మీడియాలో తారక్ ఫ్యాన్స్ సందడి మొదలు పెట్టారు. తారక్ పుట్టినరోజు సందర్భంగా దేవర నుంచి సాంగ్ లేదా టీజర్ వస్తుందని అభిమానులు అనుకున్నారు.

అయితే ఫ్యాన్స్ ఎదురుచూపులకు ముగింపు పలుకుతూ దేవర ఫస్ట్ సింగిల్ పై అప్డేట్ ఇచ్చింది చిత్రయూనిట్. మే 20న తారక్ బర్త్ డే సందర్భంగా మే 19న ఫీయర్ సాంగ్ విడుదల చేయనున్నట్లు ఓ పోస్టర్ రిలీజ్ చేశారు. పెను తుఫాను కోసం అంతా సెట్ చేశాం. #Fear Song మే 19న తీరాన్ని చుట్టుముట్టి సునామీని సృష్టిస్తుంది అంటూ చిత్రయూనిట్ రాసుకొచ్చింది. ఇక ఎన్టీఆర్ కత్తి పట్టుకున్న మాస్ పోస్టర్ షేర్ చేసింది. దీంతో ఇప్పుడు దేవర మరిన్ని అంచనాలు పెరిగిపోయాయి. దేవర చిత్రాన్ని అక్టోబర్ 10న రిలీజ్ చేయనున్నారు.

Recent

- Advertisment -spot_img