Homeహైదరాబాద్latest News‘దేవర’నయా లుక్.. యంగ్​ టైగర్​ ఫ్యాన్స్​కు కిక్

‘దేవర’నయా లుక్.. యంగ్​ టైగర్​ ఫ్యాన్స్​కు కిక్

టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర సినిమాలో నటిస్తున్నాడు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. సముద్రం బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ భామ, శ్రీదేవి ముద్దుల కూతురు జాన్వీ కపూర్ నటిస్తోంది. ఈ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. తాజాగా ఈ మూవీ షూట్​కు సంబంధించిన జూనియర్ లుక్‌ నెట్టింట తెగ వైరలవుతోంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్‌ గోవాలో జరుగుతోంది. ఈ సందర్భంగా మూవీ యూనిట్ ఎన్టీఆర్‌ ఫోటోను షేర్ చేసింది. ఇది చూసిన అభిమానులు దేవర లుక్ అదిరిపోయిందంటూ కామెంట్స్ చేస్తున్నారు. కాగా.. ఈ సినిమా దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశముంది.

Recent

- Advertisment -spot_img