Homeహైదరాబాద్latest NewsDevara: తారక్ ఫాన్స్ కి పండగలాంటి వార్త.. నేటి నుంచి థియేటర్లలో 'దావూది' సాంగ్..!

Devara: తారక్ ఫాన్స్ కి పండగలాంటి వార్త.. నేటి నుంచి థియేటర్లలో ‘దావూది’ సాంగ్..!

తెలుగు స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ నటించిన సినిమా ‘దేవర’. ఈ సినిమాకి కొరటాల శివ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయినిగా నటించగా అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు. ఈ సినిమాలో ‘దావూది’ సాంగ్ అత్యధిక వ్యూస్‌ని పొంది ట్రెండింగ్‌లో ఉన్న ఈ పాటను పెద్ద స్క్రీన్‌పై చూడాలని అభిమానులు ఎదురుచూసారు. అయితే ప్రేక్షకులు అంతా.. మాస్ సాంగ్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసినా థియేటర్లో రాకపోవడంతో సగటు ప్రేక్షకుడు నిరాశ చెందారు. కొన్ని అనివార్య కారణాల వల్ల మేకర్స్ ఈ పాటను సినిమా నుండి తొలగించారు. అయితే దేవర మూవీ అభిమానులకుచిత్రబృందం శుభవార్త తెలిపింది. ఈ పాటను సినిమాలో చేర్చబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు.శుక్రవారం (ఈరోజు) నుంచి దేవర సినిమా ఆడుతున్న అన్ని స్క్రీన్ లలో ఈ పాట కూడా ప్రదర్శించబడుతుందని వెల్లడించారు. శుక్రవారం (నేడు) నుంచి దేవర సినిమా ఆడే అన్ని స్క్రీన్లపై ఈ పాటను కూడా ప్రదర్శించనున్నట్లు వెల్లడించారు.

Recent

- Advertisment -spot_img