ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న ‘దేవర’ రిలీజ్ కోసం ఫ్యాన్స్ ఎంతగానో వేచి చూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ‘దేవర’ రిలీజ్ ట్రైలర్‌ను చిత్రబృందం తాజాగా విడుదల చేసింది. పవర్‌ఫుల్ డైలాగ్స్, అబ్బురపరిచే యాక్షన్ సన్నివేశాలతో ఈ ట్రైలర్ సినీ ప్రియులను ఎంతగానో ఆకట్టుకునేలా ఉంది. సెప్టెంబర్ 27న ఈ సినిమా విడుదల కానుంది. సైఫ్ అలీఖాన్ ప్రతి నాయకుడి పాత్రలో కనిపించనున్నారు.