ఇదే నిజం దేవరకొండ: దేవరకొండ మండలం తూర్పుపల్లి యువజన కాంగ్రెస్ నాయకులు అంకూరి మల్లేష్ మాట్లాడుతూ.. నియోజకవర్గం లో గిరిజనులు, బడుగు బలహీన వర్గాలు ఎక్కువ శాతం ఉన్న దేవరకొండ ప్రాంతానికి త్వరలో జరగబోయే మంత్రివర్గ విస్తరణలో ఎమ్మెల్యే బాలు నాయక్ మంత్రి పదవి ఇవ్వాలని కోరారు. ఎస్ ఎల్ బి సి పూర్తి కావాలన్న డిండి ఎత్తిపోతల పథకం త్వరితగతిన పూర్తి చేయాలన్న బాలు నాయక్ కి మంత్రి పదవి ఇవ్వాలన ఆయన కోరారు.
కాంగ్రెస్ పార్టీలో ఉండి ప్రజాసేవకుడిగా పనిచేసి ఎమ్మెల్యేగా నల్లగొండ జిల్లా పరిషత్ చైర్మన్ గా శాసనసభ ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలిచిన బాలునాయక్ ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజాసేవకుడిగా పని చేస్తున్నారు. ప్రజా సంఘాలలో సభ్యుడిగా ఎంతో అనుభవం కలిగిన ప్రజా నాయకుడు తాను పదవుల్లో ఉన్న సమయంలో ఎలాంటి పొరపాటు చేయని నిజాయితీ పరుడుగా అన్ని పదవులు నిర్వహించిన ఎమ్మెల్యే బాలునాయక్ కు మంత్రి పదవి ఇవ్వాలని యువజన కాంగ్రెస్ నాయకులు అంకూరి మల్లేష్ ప్రభుత్వాన్ని ఒక ప్రకటనలో కోరారు.