Homeహైదరాబాద్latest NewsCongress హయాంలోనే గ్రామాల అభివృద్ధి

Congress హయాంలోనే గ్రామాల అభివృద్ధి

ఎంపీపీ ఆరెల్లి దేవక్కకొమురయ్య గౌడ్

ఇదే నిజం రామగిరి: కాంగ్రెస్ హయాంలోనే గ్రామాల అభివృద్ధి సాధ్యమని ఎంపీపీ ఆరెల్లి దేవక్కకొమురయ్య గౌడ్ పేర్కొన్నారు. సోమవారం మండలంలోని లోంకకేసారం గ్రామంలో రూ. 28 లక్షల రూపాయలతో సీసీ రోడ్ల నిర్మాణానికి ఎంపీటీసీ కొట్టే సందీప్, మాజీ సర్పంచ్ ఎండీ మంజూరులతో కలిసి ఎంపీపీ భూమి పూజ చేశారు. తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి కోసం సీఎం రేవంత్ రెడ్డి, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పెద్దపీట వేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్​ నేతలు వీరవేని శ్రీనివాస్, ఎండీ సలీం, పిట్టల సదానందం, నామనిరామ్మూర్తి, బోయని కొమురయ్య, రంగు శంకరయ్య, నామిని మహేశ్​, బోయిని శ్రీధర్, బండి శంకర్, అగ్గి ఓదెలు, బొయిని చంద్రయ్య బుర్ల రాజయ్య ఇరుగురాల సతీష్ రమేష్ సది, ఈర్ల అంజి, రాజయ్య, కొమురయ్య, వేముల సంపత్ , ఈర్ల సతీష్ తదితరులు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img