Homeహైదరాబాద్latest Newsమహారాష్ట్ర సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన దేవేంద్ర ఫడ్నవిస్

మహారాష్ట్ర సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన దేవేంద్ర ఫడ్నవిస్

2024 అసెంబ్లీ ఎన్నికలలో మహాయుతి ఘనవిజయం సాధించిన తర్వాత బీజేపీ నాయకుడు దేవేంద్ర ఫడ్నవీస్ మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా మూడోసారి ప్రమాణ స్వీకారం చేశారు. ఉప ముఖ్యమంత్రులుగా ఏక్‌నాథ్ షిండే, అజిత్ పవార్ ప్రమాణస్వీకారం చేసారు. మహారాష్ట్ర ప్రభుత్వ ప్రమాణ స్వీకారోత్సవంలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. మహారాష్ట్ర ప్రభుత్వ ప్రమాణ స్వీకారోత్సవానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు పలువురు బీజేపీ నేతలు హాజరయ్యారు.

Recent

- Advertisment -spot_img