Devarakonda Birthday Truck: ప్రముఖ నటుడు విజయ్ దేవరకొండ తన పుట్టినరోజు సందర్భంగా ఏడు సంవత్సరాల క్రితం ప్రారంభించిన ‘దేవరకొండ బర్త్ డే ట్రాక్’ సంప్రదాయం ఈ ఏడాది కూడా ఘనంగా కొనసాగుతోంది. ఈ ట్రక్కులు దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో ఉచిత ఐస్‌క్రీమ్‌ను అందిస్తూ సందడి చేస్తున్నాయి.
ఈ సంవత్సరం, హైదరాబాద్, వరంగల్, కర్నూల్, వైజాగ్, విజయవాడ, చెన్నై, మరియు బెంగళూరు నగరాల్లో తొమ్మిది ట్రక్కులు తిరుగుతూ అభిమానులకు ఉచిత ఐస్‌క్రీమ్‌ను పంచుతున్నాయి. ఈ ట్రక్కులను ఎక్కడైనా చూసిన వారు ఎలాంటి ఖర్చు లేకుండా ఐస్‌క్రీమ్‌ను ఆస్వాదించవచ్చు.
విజయ్ దేవరకొండ ఈ సంప్రదాయం ద్వారా తన అభిమానులతో ప్రత్యేకమైన బంధాన్ని పంచుకుంటూ, వారికి ఆనందాన్ని అందిస్తున్నారు. ఈ ట్రక్కులు నగరాల్లోని వివిధ ప్రాంతాల్లో తిరుగుతూ పుట్టినరోజు వేడుకలను మరింత రంగులమయం చేస్తున్నాయి. కాబట్టి, ఈ నగరాల్లో ఎవరైనా దేవరకొండ బర్త్ డే ట్రక్‌ను చూస్తే మిస్ అవ్వకుండా ఉచిత ఐస్‌క్రీమ్‌ను ఆస్వాదించండి.