Homeహైదరాబాద్latest Newsభక్తులు అలెర్ట్.. కేదార్‌నాథ్‌, బ‌ద్రీనాథ్ ఆల‌యాలు మూసివేత‌

భక్తులు అలెర్ట్.. కేదార్‌నాథ్‌, బ‌ద్రీనాథ్ ఆల‌యాలు మూసివేత‌

భక్తులకు ముఖ్య గమనిక… చార్‌ధామ్ యాత్రలో భాగమైన కేదార్‌నాథ్ మరియు బద్రీనాథ్ ఆలయాలు మూసివేయబడతాయి. చార్ధామ్ యాత్ర చాలా పవిత్రమైనది. ఈ యాత్ర ప్రతి సంవత్సరం వేసవిలో ప్రారంభమై శీతాకాలంలో ముగుస్తుంది. ఈ యాత్ర సంవత్సరంలో ఆరు నెలలు మాత్రమే అనుమతించబడుతుంది. ఈ ప్రదేశాలు హిమాలయాల్లో ఉన్నందున, శీతాకాలంలో విపరీతమైన మంచు కారణంగా ఈ ప్రయాణాలు నిలిచిపోతాయి. తాజాగా ఆలయ కమిటీ ఈ ఏడాది కూడా చార్ధామ్ యాత్ర ముగింపు తేదీలను ప్రకటించింది.లాగే, ఈ ఏడాది ఇప్పటివరకు 38 లక్షల మంది భక్తులు చార్ధామ్ యాత్రకు వచ్చినట్లు బద్రీనాథ్-కేదార్‌నాథ్ ఆలయ కమిటీ చైర్మన్ అజేంద్ర అజయ్ తెలిపారు. ఇందులో 11 లక్షల మందికి పైగా భక్తులు బద్రీనాథ్‌ను దర్శించుకోగా, 13.5 లక్షల మంది భక్తులు కేదార్‌నాథ్‌ను సందర్శించినట్లు అధికారులు తెలిపారు. రుద్రనాథ్ ప్రవేశ ద్వారాలను ఈ నెల 17న (అక్టోబర్) మూసివేయనున్నారు. దీంతో పాటు వచ్చే నెల (నవంబర్) 2వ తేదీ మధ్యాహ్నం 12.14 గంటలకు గంగోత్రి ఆలయాన్ని మూసివేయనున్నారు. అలాగే కేదార్‌నాథ్, యమునోత్రి ఆలయాలను నవంబర్ 3న మూసివేస్తున్నట్లు వెల్లడించారు.తుంగనాథ్ ఆలయాన్ని నవంబర్ 4న మూసివేయనున్నారు.దీంతో పాటు బద్రీనాథ్ ఆలయాన్ని నవంబర్ 17వ తేదీ రాత్రి 9.07 గంటలకు మూసివేస్తామని ఆలయ కమిటీ చైర్మన్ తెలిపారు.నవంబర్ 20న మధ్యమహేశ్వరాలయం మూసివేయబడుతుంది.

Recent

- Advertisment -spot_img