ఇదే నిజం, వేమనపల్లి: మహాశివరాత్రి సందర్భంగా ప్రాణహిత నదిలో పుణ్యస్నానాలు ఆచరించేందుకు భక్తులు పోటెత్తారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి కాకుండా పక్కన ఉన్న మహారాష్ట్ర నుంచి వచ్చి పుణ్యస్నానాలు ఆచరించి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులు ట్రాక్టర్, ఎడ్లబండ్ల ద్వారా నదికి చేరుకొని పుణ్యస్నానాలు ఆచరించారు. ఈ సందర్భంగా రుద్రబట్ల సంతోష్ కుమార్ స్వర్ణలత దంపతులు అనంతరం రుద్రభట్ల నారాయణరావు జ్ఞాపకార్థం ప్రతి ఏడులాగే ప్రాణహిత నదికి స్నానమాచరించడానికి విచ్చేసే భక్తులకు అల్పాహారం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సయ్యద్ సాబీర్ అలీ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.