ద్వాదశ జ్యోతిర్లంగ క్షేత్రమైన శ్రీశైలం ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. సెలవుల కారణంగా తెలుగు రాష్ట్రాలతోపాటు ఇతర రాష్ట్రాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు ఆలయానికి పోటెత్తారు. భక్తులు స్వామి వారికి రుద్రాభిషేకం, అమ్మవారికి కుంకుమార్చన పూజలు నిర్వహించారు. మొక్కులు తీర్చుకుంటున్నారు.
భక్తుల రద్దీ పెరగడంతో టోల్‌గేట్ మలుపు వద్ద ట్రాఫిక్ సమస్య ఏర్పడింది. ట్రాఫిక్‌ను నియంత్రించడంతో పాటు ఆలయ పరిసరాల్లో ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని భక్తులు కోరుతున్నారు.