ఖైరతాబాద్‌లోని సప్తముఖ మహాగణపతిని దర్శించుకునేందుకు భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. ఇక్కడ గణేశ్ వేడుకలను ప్రారంభించి 70 ఏళ్లు అయిన సందర్భంగా ఈసారి 70 అడుగుల ఎత్తులో వినాయకుడి విగ్రహాన్ని సిద్ధం చేశారు. మహాగణపతి వద్ద భారీ బందోబస్తు చేపట్టారు. ఈ మార్గంలో ట్రాఫిక్ ఇబ్బందులు ఏర్పడకుండా పోలీసులు అన్ని చర్యలు తీసుకుంటున్నారు. 70 అడుగుల ఖైరతాబాద్ సప్తముఖ మహా గణపతికి తొలిపూజ జరుగుతోంది. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం పాల్గొన్నారు. భక్తులు భారీగా తరలివచ్చారు.