– తొమ్మిదిన్నరేండ్లు కొనసాగిన ప్రభాకర్ రావు
ఇదే నిజం, హైదరాబాద్: ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ పదవికి దేవులపల్లి ప్రభాకర్‌రావు రాజీనామా చేశారు. రాష్ట్రంలో 24 గంటల పాటు నిరంతరాయంగా విద్యుత్ అందించడంలో ప్రధాన పాత్ర పోషించిన ప్రభాకర్ రావు.. తొమ్మిదిన్నరేండ్ల పాటు ఆ పదవిలో కొనసాగారు. 22 ఏండ్ల వయస్సులోనే విద్యుత్ శాఖలో చేరిన ఆయన 2014, జూన్ 5న జెన్‌కో సీఎండీగా బాధ్యతలు చేపట్టారు. అదే ఏడాది అక్టోబర్ 25న ట్రాన్స్‌కో ఇన్‌చార్జిగా నియమితులయ్యారు. తొలుత ఆయన్ను రెండేండ్ల పదవీ కాలానికి సీఎండీగా ప్రభుత్వం నియమించినప్పటికీ.. తర్వాత పదవీ కాలాన్ని పొడిగిస్తూ వస్తున్నది. తాజాగా ఆయన తన పదవికి రాజీనామా చేశారు. దీంతో 54 ఏండ్లపాటు సంస్థకు సేవలు అందించారు. తన పదవీ కాలంలో విద్యుత్ శాఖకే ఆయన వెలుగులు పంచి వన్నె తెచ్చారు.