విమానాల్లో ప్రయాణించే చిన్నారుల కోసం డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ గుడ్‌న్యూస్ చెప్పింది. ఇక నుంచి 12 ఏళ్లలోపు ఉన్న పిల్లలకు వారి తల్లిదండ్రుల్లో ఒకరి పక్కన సీటు కేటాయించేలా మార్పులు చేయాలని విమానయాన సంస్థలకు ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం కొన్ని సందర్భాల్లో తల్లిదండ్రులకు, పిల్లలకు దూరంగా సీట్లు కేటాయిస్తుండటంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతూ..ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం డీజీసీఏ తీసుకున్న నిర్ణయంతో విమాన ప్రయాణికులకు ఉపశమనం లభించినట్లయింది. అదేవిధంగా జీరో బ్యాగేజీ, సీట్ల ప్రాధాన్యం, మీల్స్/ స్నాక్స్/డ్రింక్స్ తీసుకెళ్లడానికి ఫీజు వసూలు చేసుకోవచ్చని విమానయాన సంస్థలకు వెసులుబాటు కల్పించింది.