Homeక్రైంఫిర్యాదు దారులను స్టేషన్​ చుట్టూ తిప్పుకోవద్దు: డీజీపీ

ఫిర్యాదు దారులను స్టేషన్​ చుట్టూ తిప్పుకోవద్దు: డీజీపీ

స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదు దారుల సమస్యలు చట్టపరంగా పరిష్కరించాలని పోలీసులను డీజీపీ మహేందర్​ రెడ్డి ఆదేశించారు. తొలిసారి వచ్చినప్పుడే సమస్య పరిష్కరించి మరోసారి స్టేషన్​కు రాకుండా చూసుకోవాలని సూచించారు. పదేపదే తిప్పుకోవడం వల్ల ఫిర్యాదుదారులలో అసంతృప్తి నెలకొనేందుకు కారణమవుతోందని వ్యాఖ్యానించారు. సమస్య చిన్నదైనా, పెద్దదైనా త్వరగా పరిష్కరించకుండా స్టేషన్ల చుట్టూ తిప్పితే ఉన్నతాధికారులను ఆశ్రయిస్తున్నారని పేర్కొన్నారు.

RELATED ARTICLES

Recent

- Advertisment -spot_img