– భరోసా కేంద్రాలు దేశానికే ఆదర్శం
– డీజీపీ అంజనీకుమార్
– గోషామహల్ స్టేడియంలో అమరవీరుల సంస్మరణ దినోత్సవం
ఇదేనిజం, తెలంగాణ బ్యూరో: పోలీసు సేవల్లో తెలంగాణ టాప్లో ఉందని డీజీపీ అంజనీకుమార్ పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేసిన భరోసా కేంద్రాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తాయన్నారు. హైదరాబాద్లోని గోషామహల్ స్టేడియంలో అమరవీరుల సంస్మరణ దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా డీజీపీ అంజనీకుమార్ మాట్లాడుతూ.. సమాజ శ్రేయస్సే ఊపిరిగా ప్రజల కోసం ప్రాణాలను అర్పించిన పోలీసు అమరవీరులకు ఘనంగా నివాళి అర్పించారు. పోలీసు అమర వీరుల సంస్మరణ దినోత్సవం, పోలీస్ ఫ్లాగ్ డే సందర్భంగా హైదరాబాద్ గోషామహాల్ స్టేడియంలో నిర్వహించిన కార్యక్రమానికి డీజీపీ అంజనీ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం మాట్లాడుతూ.. పోలీసు సేవల్లో తెలంగాణ ముందువరుసలో ఉందన్నారు. భరోసా కేంద్రాలు దేశానికే ఆదర్శంగా మారాయని చెప్పారు. అత్యధిక సీసీ కెమెరాలు ఉన్న రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని తెలిపారు. రాష్ట్రంలో క్రైం రేట్ తగ్గుతూ వస్తున్నదని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో నగర పోలీస్ కమిషనర్ సoడీప్ శాండిల్య, అడిషనల్ డీజీలు సౌమ్య మిశ్రా, శివధర్ రెడ్డి, సంజయ్ కుమార్ జైన్, అనీల్ కుమార్, మహేష్ భగవత్ లతోపాటు పలువురు పోలీసు వున్నతాధికారులు, రిటైర్డ్ డీజీపీలు, రిటైర్డ్ ఉన్నతాధికారులు, అమర పోలీసు కుటుంబాలు పెద్ద ఎత్తున హజరయ్యారు.