కోలీవుడ్ స్టార్ ధనుష్ హీరోగా నటించిన సినిమా ‘రఘువరన్ బీటెక్’. ఈ సినిమాలో అమలాపాల్ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాకి వేల్ రాజ్ దర్శకత్వం వహించారు.ఈ సినిమా 2015లో విడుదలై ఘన విజయం సాధించింది. ఈ సినిమాకి అనిరుధ్ సంగీతం అందించాడు. ఈ సినిమాలోని పాటలు సూపర్ హిట్టుగా నిలిచాయి. అయితే ఈ సినిమా మరోసారి థియేటర్లలో సందడి చేయనుంది. ఈ సినిమాని మళ్లీ జనవరి 4 రెండు తెలుగు రాష్ట్రాల్లో రి-రిలీజ్ చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.ఈ సినిమాని తెలుగులో శ్రీ స్రవతి మూవీస్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత స్రవంతి రవికిషోర్ విడుదల చేసిన సంగతి తెలిసిందే.