Dharani:త్వరలో ధరణి ఫైల్స్ రిలీజ్ చేయబోతున్నామని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు .ధరణిలో పెట్టుబడిదారులు ఎవరో కేంద్ర ప్రభుత్వం నిగ్గు తేల్చాలని కిషన్ రెడ్డికి సవాల్ విసురుతున్నానని అన్నారు.ఇంకా రేవంత్ ఏమన్నారంటే..
కిషన్ రెడ్డి చంద్రశేఖర్ రావు ధరణి దోపిడీలపై స్పందించాలి. కేటీఆర్ ఢిల్లీ పర్యటనతో బీజేపీ,బీఆరెస్ ఫెవికాల్ బంధాన్ని బలోపేతం చేసేందుకు బీజం పడింది.. బీసీ, ఎస్సీ, ఎస్టీ ఎన్నికల అభ్యర్థులను మొట్టమొదట ప్రకటించాలని పార్టీలో చర్చలు జరిపాం.రాజేందర్ అన్నను ఫిరాయింపుల కమిటీ నుంచి ఎన్నికల కమిటీకి మార్చారు.. రాజేందర్ ను బీజేపీ మోసం చేసింది.. రాజేందర్ కు భద్రత పెంచినా… అనుమానితుడిపై ఎందుకు కేసు పెట్టలేదు. ఎవరి వల్ల ప్రమాదం ఉందో రాజేందర్ స్పష్టంగా చెప్పారు… అయినా రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు కేసులు పెట్టలేదు?. నా రక్షణ విషయంలో కోర్టు ఇచ్చిన ఆదేశాలను పట్టించుకోని ప్రభుత్వం… రాజేందర్ అన్నకు భద్రత ఏర్పాటు చేయడం సంతోషమన్నారు.
ప్రజలకు, మీడియాకు ధరణికి సంబంధించి టెర్రాసిస్ కంపెనీ మాత్రమే కనిపిస్తోంది దీని వెనక పెద్ద మాఫియా దాగుంది.. దీనిపై ఆధారాలతో సహా సీరియల్ గా బయటపెడతాం..ప్రజల ఆస్తులు, భూములు,వ్యక్తిగత వివరాలు విదేశీయుల చేతుల్లోకి వెళుతున్నాయి.ఇందులో బ్రిటిష్ ఐల్యాండ్ కు సంబంధించిన పెట్టుబడులు ఉన్నాయి.ధరణి దోపిడీలపై అన్ని ఆధారాలతో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తా..అన్నారు రేవంత్