Homeతెలంగాణద‌స‌రాకి ధరణి పోర్టల్ః కేసీఆర్‌

ద‌స‌రాకి ధరణి పోర్టల్ః కేసీఆర్‌

డాక్యుమెంట్స్ రైట‌ర్ల‌కు లైసెన్సులు.. రిజిస్ట్రేషన్ రేట్లు ఫిక్స్
మండ‌లానికో కంప్యూట‌ర్ ఆప‌రేట‌ర్ నియామ‌కం

హైదరాబాద్: ద‌స‌రా పండుగ రోజున ధరణి పోర్టల్ ప్రారంభించాలని సీఎం కె.చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. పోర్టల్ ప్రారంభానికి అవసరమైన అన్ని సాఫ్ట్‌వేర్‌, హార్డ్‌వేర్, బ్యాండ్ విడ్త్‌ ప‌నుల‌ను ఆ లోపుగానే పూర్తి చేయాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. కొత్త రిజిస్ట్రేషన్ విధానం, వెంటనే మ్యుటేషన్ చేయడం, ధరణి పోర్టల్‌లో వివరాలను అప్ డేట్ చేయడం తదితర అంశాలు, విధివిధానాలపై తహశీల్దార్లు, డిప్యూటీ తహశీల్దార్లు, సబ్ రిజిస్ట్రార్ లకు అవసరమైన శిక్షణ ఇచ్చేందుకు త‌గిన ఏర్పాట్లు చేయాల‌ని అధికారుల‌కు సీఎం సూచించారు.
ప్రతి మండలానికి ఒకరు చొప్పున, ప్రతి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఒకరు చొప్పున కంప్యూటర్ ఆపరేటర్ల నియోమకాన్ని పూర్తి చేయాలని అధికారులను సిఎం ఆదేశించారు. ధరణి పోర్టల్ ప్రారంభం కావడానికి ముందే రాష్ట్ర వ్యాప్తంగా సర్వే నెంబర్ల వారీగా రిజిస్ట్రేషన్ రేట్లను నిర్ణయించనున్నట్లు సిఎం చెప్పారు. తహశీల్దారు కార్యాలయాలు, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలలో డాక్యుమెంట్ రైటర్లకు లైసెన్సులు ఇచ్చి వారికి శిక్షణ కూడా ఇవ్వనున్నట్లు వెల్లడించారు. దసరా లోగానే అన్ని రకాల ఆస్తులకు సంబంధించిన డేటాను ధరణి పోర్టల్‌లో నమోదు చేయాలని సీఎం అధికారుల‌ను ఆదేశించారు.

RELATED ARTICLES

Recent

- Advertisment -spot_img