Homeహైదరాబాద్latest Newsధరణి వెబ్‌సైట్‌ను వెంటనే రద్దు చేయాలి.. రైతుల భూ సమస్యలు పరిష్కరించాలి: బీసీ సంక్షేమ సంఘం...

ధరణి వెబ్‌సైట్‌ను వెంటనే రద్దు చేయాలి.. రైతుల భూ సమస్యలు పరిష్కరించాలి: బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రచార కార్యదర్శి ఓరగంటి భార్గవరామ్

ఇదే నిజం, గొల్లపల్లి : తెలంగాణ ప్రభుత్వం ధరణి వెబ్‌సైట్‌ ను వెంటనే రద్దు చేసి రైతుల భూ సమస్యలు పరిష్కరించాలని గొల్లపల్లిలో ఏర్పాటు బీసీ సమావేశంలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రచార కార్యదర్శి ఓరగంటి భార్గవరామ్ డిమాండ్ చేశారు. బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రచార కార్యదర్శి ఓరగంటి భార్గవరామ్ మాట్లాడుతూ.. ధరణిని బొంద పెట్టి పిండము పెట్టాలనీ భూ సమస్య పరిష్కారం కొరకు ప్రతి గ్రామానికి రెవెన్యూ ఆఫీసర్ ను నియమించాలి. స్వతంత్రం వచ్చి దశాబ్దాలు గడిచిన రెవెన్యూ చట్టాలు మారిన భూ సమస్యలు తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు పరిష్కారము కావడం లేదు. కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత భూ సమస్యలకు కారకుడు అయినాడు రైతులు భూ సమస్యలతో చాలా ఇబ్బందులు పడుతున్నారు. వీఆర్వోలు అవినీతికి పాల్పడుతున్నారని వీఆర్వోలను అందరిని తొలగించి రాష్ట్రంలో లక్షలాది రైతుల భూములు ఆన్లైన్ పహానిల్లో తొలగించి సమస్యలకు సృష్టికర్త అయినాడు కేసీఆర్.అర్థంపర్థం లేని ధరణి అనే ఒక వ్యవస్థను తెచ్చి రైతుల నెత్తిన రుద్దినారు.గ్రామాలలో వీఆర్వోలతో పరిష్కారమయ్యే సమస్యలను తీసుకుపోయి జిల్లా కలెక్టర్లకు అధికారము ఇచ్చి అనాలోచితమైన నిర్ణయము తీసుకున్నాడు. ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో రైతులందరూ ధరణి బాధితులే ధరణిలో అనేకమైన మాడ్యులేషన్స్ పెట్టి రెవెన్యూ అధికారులకు కూడా అర్థం కాని పరిస్థితిని కేసీఆర్ కల్పించినాడు. భూ సమస్యలపై ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుంటే వేలాది రూపాయలు ఫీజు రూపంలో చెల్లించినారు.నేటికీ సమస్యలు పరిష్కరింపబడలేదు, ఫీజులు కూడా ఎవ్వరికి పోయినాయో అర్థం కావడం లేదు, భూ సమస్య గురించి మీ సేవలో చెల్లించిన ఫీజులపై ఒక కమిటీని వేసి విచారణ జరిపించాలి. రైతులు ఆన్లైన్ మీ సేవలో చెల్లించిన డబ్బులు ఎవడు బుక్కాడో, నిజము తేల్చి వారినీ చట్టపరంగా శిక్షించి అట్టి ఫీజుల రూపములో వసూలు చేసిన డబ్బులను తిరిగి రైతులకు వాపస్ ఇవ్వాలి. సామాజికవేత్తలు లాయర్స్ ధరణిలో చెల్లించిన ఫీజులపై హైకోర్టులో కేసులు వేసి రైతులకు సహాయం చేయాలి.ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భూ సమస్యలపై దృష్టి పెట్టి ధరణి అనే వ్యవస్థను కూకట్వేలతో పెకిలించి హుస్సేన్ సాగర్ నీళ్లలో పారవేసి ప్రతి గ్రామానికి ఒక వీఆర్వోను నియమించి భూ సమస్యల పరిష్కారం కొరకు ఒక మార్గము అన్వేషించగలరు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రచార కార్యదర్శి ఓరగంటి భార్గవ రామ్,బీసీ సంక్షేమ సంఘం మండల అధ్యక్షుడు బంగుడపు తిరుపతి, జిల్లా కార్యదర్శి కాళ్ళ రాజయ్య కందుకూరి తిరుపతి, బంగుడపు కొమురెల్లి,తదితరులు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img