Homeజిల్లా వార్తలుDharmapuri : నేరెళ్ల హత్య కేసులో మరో వ్యక్తికి రిమాండ్

Dharmapuri : నేరెళ్ల హత్య కేసులో మరో వ్యక్తికి రిమాండ్

ఇదే నిజం, ధర్మపురి టౌన్ : జగిత్యాల జిల్లా ధర్మపురి (Dharmapuri) మండలం నేరెళ్ల గ్రామ శివారులోని అటవీ ప్రాంతంలో గత నెలలో ఒక వ్యక్తిని చంపి కాల్చివేసిన కేసులో తేది 22.12.2024 రోజున నిందితులు నేరెళ్ల గోపాల్ తండ్రి రమేష్, వయస్సు 30 సంవత్సరాలు, కులం గౌడ్, గ్రామం కమలాపూర్ మరియు గండికోట శేఖర్ తండ్రి శ్రీనివాస్, వయస్సు 27 సంవత్సరాలు, కులం వడ్డెర, గ్రామం నేరెళ్ళ లను కోర్ట్ లో ప్రవేశపెట్టి జ్యుడీషియల్ రిమాండ్ కు పంపడం జరిగింది. అదే కేసు దర్యాప్తు లో భాగంగా నేరెళ్ళ గ్రామానికి చెందిన మెరుగు లక్ష్మన్ తండ్రి నారాయణ , కులం గౌడ గ్రామం నెరెళ్ళ అను అతడు కూడా కేసుకు సంబంధం ఉంది అని నిర్ధారణ కావడంతో అతడిని ఈరోజు తేది 28.01.2025 నాడు అదుపులోకి తీసుకొని అతడిని కూడా జ్యుడీషియల్ రిమాండ్ కు పంపించినట్లు ధర్మపురి సిఐ రామ్ నర్సింహారెడ్డి తెలిపారు.

Recent

- Advertisment -spot_img