Homeజిల్లా వార్తలుDharmapuri : తెలంగాణ మైనార్టీ గురుకులలో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం

Dharmapuri : తెలంగాణ మైనార్టీ గురుకులలో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం

ఇదే నిజం, ధర్మపురి టౌన్ : జగిత్యాల జిల్లా ధర్మపురి (Dharmapuri) పట్టణంలోని తెలంగాణ మైనారిటీ గురుకుల కళాశాలలో 2025-2026 విద్యా సంవత్సరానికి గాను ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ కాళ్ళ లక్ష్మి పేర్కొన్నారు విద్యార్థులు ఇంటర్ మొదటి సంవత్సరం ప్రవేశాలకు http/tmriestelangana.cgg.gov.in వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు ఇంటర్మీడియట్ సీఈసీ అండ్ హెచ్ ఇ సి ప్రథమ సంవత్సరాలకు ముస్లింలకు 51 క్రిస్టియన్లకు ఐదు జైనులు పార్శీలు, సిక్కులు , బౌద్ధులకు ఒక్కొక్కటి చొప్పున మొత్తం 60 సీట్లు ఎస్సీలకు 5 ఎస్టీలకు 5 బీసీలకు 10 ఓబిసిలకు రెండు చొప్పున మొత్తం 80 సీట్లు కేటాయించారని వెల్లడించారు దరఖాస్తు చేసుకునే విద్యార్థులు ఆధార్ కార్డ్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోలను జతచేయాలని సూచించారు వివరాలకు 7207998950 ఫోన్ నెంబర్ లో సంప్రదించవచ్చు అని తెలిపారు

Recent

- Advertisment -spot_img