ఇదే నిజం, ధర్మపురి టౌన్ : జగిత్యాల జిల్లా ధర్మపురి (Dharmapuri) మండలం కొస్నూర్‌పల్లె గ్రామంలో పశు వైద్య మరియు పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ఉచిత పశు వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో 120 పశువులకు చూడి గర్భనిర్ధారణ పరీక్షలు, కట్టు నిల్వకపోవడం సమస్య లకు, గర్భకోశ సంబంధిత వ్యాధులకు చికిత్స , కట్టుకు రాని పెయ్య లకు పరీక్షలు, వివిధ రకాల వ్యాధులకు చికిత్స, దూడలకు నట్టల నివారణ మందులు ఇవ్వడం జరిగింది. రైతులకు సబ్సిడీ ధరలో పశుగ్రాస రుపతి గౌడ్, డాక్టర్ వేణుగోపాల్, సహాయక డాక్టర్ ప్రశాంత్, గణేష్, ఆఫీస్ సబార్డినేట్ మురళి, గోపాలమిత్ర భూమేష్, అరుణ్, రిటైర్డ్ ఓఎస్ దేవయ్య, గ్రామ కార్యదర్శి మరియు మాజీ సర్పంచ్, పాడి రైతులు పాల్గొన్నారు.