Homeజిల్లా వార్తలుఆలయ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ధర్మపురి ఎమ్మెల్యే

ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ధర్మపురి ఎమ్మెల్యే

ఇదేనిజం, గొల్లపల్లి: జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం లొత్తునూర్ గ్రామంలో కోదండ రామాలయం, శివాలయ నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. ప్రభుత్వ విప్, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కార్యక్రమంలో పాల్గొని శంకుస్థాపన చేశారు. అనంతరం గొల్లపెల్లి మండలం లోత్తునూర్ గ్రామానికి చెందిన ఓరుగంటి వెంకటేష్ ఇటీవల మృతిచెందగా వారి కుటుంబాన్ని ఎమ్మెల్యే పరామర్శించారు. బాధిత కుటుంబానికి రూ.5వేలు ఆర్థిక సాయం అందజేశారు. కార్యక్రమంలో మండల అధ్యక్షుడు నిశాంత్ రెడ్డి, గ్రామ శాఖ అధ్యక్షుడు సుమన్ గౌడ్, నేరెళ్ల మహేష్, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img