Homeజిల్లా వార్తలుDharmapuri: ఏసీబీ వలలో ధర్మపురి మున్సిపల్ కమిషనర్.. లంచం తీసుకుంటూ అడ్డంగా బుక్కయ్యాడు..!

Dharmapuri: ఏసీబీ వలలో ధర్మపురి మున్సిపల్ కమిషనర్.. లంచం తీసుకుంటూ అడ్డంగా బుక్కయ్యాడు..!

ఇదే నిజం, ధర్మపురి టౌన్: జగిత్యాల జిల్లా ధర్మపురి (Dharmapuri) మున్సిపల్ కమిషనర్ కందుకూరి శ్రీనివాస్ 20వేల రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు దొరికాడు. మున్సిపల్ కార్యాలయంలో ఔట్సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేస్తున్న పైడిపల్లి మహేష్ కు గత నాలుగు నెలలుగా జీతాలు రావడం లేదు. జీతాల విషయమై కమిషనర్లు అడగగా 30000 రూపాయలు డిమాండ్ చేశాడు. గత వారం పదివేల రూపాయలు తీసుకున్నాడు. ఇంకా 20000 ఇచ్చే వరకు జీతాలు రావు అనడంతో మహేష్ ఏసీబీ అధికారులను సంప్రదించాడు. ఈ రోజు ఆ డబ్బులు తీసుకునే సమయంలో ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.

Recent

- Advertisment -spot_img