ఇదే నిజం, ధర్మపురి టౌన్ : జగిత్యాల జిల్లా ధర్మపురి (Dharmapuri) మున్సిపల్ పట్టణంలోని రైతు కూలీల గురించి మరియు చదువుకునే విద్యార్థుల గురించి ధర్మపురి మున్సిపల్ అయినా తర్వాత మున్సిపల్ చట్ట ప్రకారం రైతు కూలీలకు మరియు చదువుకునే విద్యార్థులకు అన్యాయం జరుగుతుంది కాబట్టి వారికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ భారతీయ జనతా పార్టీ పట్టణ అధ్యక్షులు గాజు భాస్కర్ ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్ కి ఎంపీడీవో కి ఎమ్మార్వో కి వినతిపత్రం ఇవ్వడం జరిగింది.
ఈ సందర్భంలో పట్టణ అధ్యక్షులు గాజు భాస్కర్ మాట్లాడుతూ.. ధర్మపురిలో చాలా మంది వ్యవసాయ రైతు కూలీలు ఉన్నారు.. వారు పత్తి తీయ వెళ్లడం కానీ, నాట్లు వేయడం లాంటి పొలం పనులకు వెళ్లడం జరుగుతుంది.. అయితే ప్రభుత్వం సొంత భూమి లేని వ్యవసాయ కూలీలకు సంవత్సరానికి 12000 రూపాయలు ఇస్తా అని చెప్పడం జరిగింది. కానీ దానికి ఉపాధి హామీ పథకం క్రింద సంవత్సరానికి 20 రోజులు పని చేసిన వారిని అర్హులు గా పెట్టడం జరిగింది. అలాగే పట్టణంలోని చదువుకునే విద్యార్థులు కూడా కొన్ని వ్యవసాయానికి సంబంధించిన చదువులకు అనర్హులుగా ప్రకటించడం జరిగింది అని తెలిపారు. ధర్మపురి మున్సిపాలిటీ అయినా తరువాత ఉపాధి హామీ పథకం పట్టణాలకు వర్తించదు అని తీసి వేయడం జరిగింది.. ఇందు వలన చాలా మందికి ఉపాధి హామీ కార్డు లు, విద్యార్థులు వ్యవసాయదానికి సంబంధించిన చదువులు చదువుకోలేకపోతున్నారు. మరి ఇట్టి షరతుల వలన ధర్మపురి పట్టణంలో చాలా మంది వ్యవసాయ కూలీలు, విద్యార్థులు నష్ట పోవడం జరుగుతుంది. ఇట్టి విషయము గురించి ధర్మపురి పట్టణంలో అర్హులైన వ్యవసాయ కూలీలు అందరికీ సంవత్సరానికి 12000 రూపాయలు వచ్చే విధంగా చూడాలని, చదువుకునే విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ మాట్లాడడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు గాజు భాస్కర్, మండల అధ్యక్షులు కుమ్మరి తిరుపతి, అసెంబ్లీ కో కన్వీనర్ బండారి లక్ష్మణ్, ఓబీసీ మోర్చా జిల్లా కార్యదర్శి ఆకుల శ్రీనివాస్, సీనియర్ నాయకులు నల్మాసు వైకుంఠం, పల్లెర్ల సురేందర్, మాజీ పట్టణ అధ్యక్షులు బెజ్జారపు లవన్ కుమార్, తిరుమందాస్ సత్యనారాయణ, దివిటి శ్రీధర్, మండలోజు సూరజ్, బాకీ అనిల్, అనందాసు నవీన్,తోట శ్రీనివాస్, అప్పం శ్రీనివాస్, కసెట్టి రాజేష్, సంఘీ రాజేష్, కలకొండ రాజు, పాకల సాయికిరణ్, కుమ్మరి అనిల్, ఒడ్డేటి శ్రీకాంత్, మరియు తదితరులు పాల్గొన్నారు.