ఇదే నిజం, ధర్మపురి టౌన్ : జగిత్యాల జిల్లా ధర్మపురి (Dharmapuri ) యేసయ్య మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సంఘ నర్సింహులు రైతులతో కలిసి పంట పొలాలకు నీరు అందించే విషయంలో రైతుల శ్రేయస్సు కొరకు అహర్నిశలు కృషి చేస్తున్న మాజీ సర్పంచ్ జంగిలి ప్రభాకర్, ముత్యం సంతోష్, పోడేటి తిరుపతి, పోడేటి వెంకటేష్, పోడేటి ఉపేందర్, తోట సత్తన్న, మారినేని ఎర్రయ్య, ఉప్పు గౌతమ్, అనకొండ రాజన్న, తోట ఈశ్వరయ్య, మేడి లచ్చయ్య, పత్తి నరసయ్య, మా పంట పొలాలకు నీళ్లు కావాలని ప్రభుత్వ విప్ ధర్మపురి శాసనసభ్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కి విన్నవించగానే సంబంధించిన డిఈ కి ఫోన్ చేసి మా పంట పొలాలకు నీళ్లు అందించిన ప్రభుత్వ విప్ ధర్మపురి శాసనసభ్యులు లక్ష్మణ్ కుమార్ కి దోనూర్ గ్రామ ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలిపారు.