ఇదే నిజం, మెట్ పల్లి రూరల్: మెట్ పల్లి మండలం వెంపేట గ్రామంలో రైతులు రుణ మాపీ కాలేదని స్థానిక కెనరా బ్యాంకు ఎదుట రోడ్డు పై శనివారం బైటయించి ధర్నా నిర్వహించారు. బ్యాంకు వారు రైతుల డేటాను పంపకపోవడంతో రుణ మాఫీ కాలేదని ఆరోపించారు. స్పందించిన బ్యాంకు అధికారులు డేటాను పంపించినప్పటికి, సాంకేతిక సమస్యతో రుణమాఫీ కాలేదని తెలిపారు. ధర్నాతో ట్రాఫిక్ స్థంభించడంతో ఘటనా స్థాలానికి పోలీసులు చేరుకొని రైతులను సముదాయించి ధర్నా విరామింపచేశారు.